Categories
Naukrijbs-Telugu

Telangana Inter Practical Exams 2023: ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ సిలబస్‌పై తెలంగాణ ఇంటర్‌ బోర్డు కీలక ప్రకటన | TS inter practical exams will be conducted with 70 per cent syllabus in 1st year and 100 per cent syllabus in 2nd year

తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 5 వరకు ప్రాక్టికల్స్‌ జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జరిగే ప్రాక్టిలకల్స్‌ పరీక్షలు ఫస్టియర్‌లో 70 శాతం, సెకండియర్‌లో..

తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 5 వరకు ప్రాక్టికల్స్‌ జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జరిగే ప్రాక్టిలకల్స్‌ పరీక్షలు ఫస్టియర్‌లో 70 శాతం, సెకండియర్‌లో 100 శాతం సిలబస్‌ ఆధారంగా జరుగుతాయని తెలంగాణ ఇంటర్‌బోర్డు ఓ ప్రకటనలో వెల్లడించింది. రోజుకు రెండు షిఫ్టుల ప్రకారం ప్రాక్టికల్స్ జరనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి షిఫ్ట్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సెకండ్‌ షిఫ్ట్‌ పరీక్షలు జరుగుతాయి. వార్షిక పరీక్షలు మాత్రం ఫస్టియర్‌, సెకండియర్‌లకు వంద శాతం సిలబస్‌తో ఉంటాయని స్పష్టం చేసింది.

ఇంటర్ వార్షిక పరీక్షలు ఏప్రిల్ 20,22,25,27,29 మే 2 తేదీల్లో ఇంటర్ ఫస్టియర్ విద్యార్ధులకు, ఏప్రిల్ 21, 23, 26, 28, 30, మే 5 తేదీల్లో ఇంటర్ సెకండియర్ విద్యార్ధులకు జరగనున్నాయి. మార్చి 4న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష, మార్చి 6న ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్‌ పరీక్ష నిర్వహిస్తారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.